Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం జిల్లా బీజేపీలో “సిరి గోల్డ్ స్కాం” రచ్చ… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 10:07 pm
Date of Publish : 05 Jan 2026, 10:37 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1002 💬 0
Telangana > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad

ఖమ్మం జిల్లా బీజేపీలో “సిరి గోల్డ్ స్కాం” రచ్చ…

ఖమ్మం జిల్లా బీజేపీలో “సిరి గోల్డ్ స్కాం” రచ్చ…

ఖమ్మం జిల్లా:ది:5:1:2026

సిరి గోల్డ్ మర్చంట్స్ పేరుతో రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ మోసం కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ విధితమే, హైదరాబాద్ ఉప్పల్‌లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీందర్ పాటు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుపైహైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు BNS సెక్షన్ 316(2), 318(4) కింద కేసు నమోదు చేయడం జరిగింది దీంతో ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీలో తీవ్ర స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి,గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది…..

ఎప్పటి నుండో ఒక వర్గం బీజేపీ నాయకులకు,కార్యకర్తలకుఅధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుకు పొసగడంలేదు, నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షుడు అయ్యాక జిల్లా స్థాయి నాయకులను కూడా లెక్క చేయకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నాడని,కార్యకర్తలకు కనీస మర్యాదల కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు నోరు జారుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్న సందర్భంలో నెల్లూరి కోటేశ్వరరావుపైనమోదైన "సిరి గోల్డ్ స్కాం" కేసు ప్రత్యర్థులకు అనుకోని "అస్త్రం"లా మారింది….

ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వ్యతిరేకులు గోల్డ్ స్కాంలో కేసు నమోదు అంశాన్ని ఆసరాగా తీసుకునిబీజేపీ పార్టీలో ఒక వర్గం త్వరలో జిల్లా అధ్యక్షుని మార్పు జరగడం ఖాయం అంటూ ప్రచారం మొదలు పెట్టారు,ఎన్నో ఏండ్ల నుండి జిల్లా అధ్యక్ష పదవి కమ్మ సామాజిక వర్గం వారికి కేటాయించడం జరుగుతుంది కానీ ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించడంపై బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి,ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీకి బడుగు,బలహీన వర్గాలకు చెందిన వారే ఇప్పటిదాకా వెన్నుముకగా ఉన్నారు కాబట్టి ఈసారి బీసీ వర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఒక వర్గం తీవ్ర స్థాయిలో అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తుండగా,కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మరో నాయకుడు,ఒక జాతీయ స్థాయి నాయకుని ఆశీస్సులతో అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్లు బీజేపీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది,ఈ క్రమంలోనే ఇరువర్గాలు తమ అనుచరులను కారుల్లో హైదరాబాద్ తరలించి బీజేపీ అధిష్టానం దగ్గర బల ప్రదర్శన కూడా నిర్వహించినట్లు కొందరు బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం,ఈ క్రమంలోనే కొందరు నాయకులను అధిష్టానం తీవ్రంగా మందలించి పంపించినట్లు ప్రచారం జరగడం విశేషం….

ఈ విషయంలో బీజేపీ అధిష్టానం నుండి ఇప్పటి వరకూ ఏటువంటి స్పందన లేనప్పటికీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి,ఒకవైపు ఆ స్కాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు,నాపై కేసు పెట్టిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై ట్రోలింగ్ ఆగడం లేదు,….

సదరు జిల్లా అధ్యక్షునిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయినప్పటికి జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతో అరెస్ట్ కాకుండా మేనేజ్ చేసుకున్నాడని బీజేపీ పార్టీలోనీ ఒక వర్గం ప్రచారం చేయడంపై బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్న తరుణంలో అసలు మంత్రికి బీజేపీ జిల్లా అధ్యక్షునికి మధ్య ఉన్న సంబంధంపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తుందంటూ బీజేపీ వర్గాల్లో మరో ప్రచారం జరుగుతుంది,పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల వలన జిల్లా అధ్యక్షుని హోదాలో జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం పెడితే పట్టుమని పదిమంది కార్యకర్తలు కూడా హాజరు కావడం లేదని కొంతమంది బీజేపీ నేతలు, కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు…..

ఈ స్కాంతో ఎటువంటి సంబంధం లేకపోయినా కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని నామీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ
నెల్లూరి కోటేశ్వరరావు చెబుతున్నప్పటికీ,ఆధారాలు లేకుండా అంత పెద్ద కేసులో A2 గా కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రత్యర్థులు వాదిస్తున్నారు,ఈ విషయంలో ఒక బహిష్కృత బీజేపీ నాయకుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో జిల్లా అధ్యక్షుని స్కాములు,అతని వ్యవహార శైలిపై ప్రచారం చేయడమే కాకుండా,ఆ కేసు యొక్క ప్రతులను డిల్లీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళానని,అవసరమైతే డిల్లీలో బీజేపీ పెద్దలను స్వయంగా కలిసి పరిస్థితిని వివరిస్తానని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడంతో బీజేపీ పార్టీలోని ఒక వర్గం ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి…..