Janam Muchata – Voice of the People | Telugu News Platformతెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: రేవంత్ రెడ్డికి కష్టకాలం? సీఎం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 26 Aug 2026, 6:00 am
Date of Publish : 21 Aug 2026, 5:39 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 206 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: రేవంత్ రెడ్డికి కష్టకాలం? సీఎం మార్పు ప్రచారం వెనుక అసలు కథ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్: రేవంత్ రెడ్డికి కష్టకాలం? సీఎం మార్పు ప్రచారం వెనుక అసలు కథ!

హైదరాబాద్:తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర వేడెక్కింది  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరీక్షా సమయం ప్రారంభమైందని, ఆయన తన అధికారాన్ని ఏ మేరకు కాపాడుకోగలరు అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు,ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో పెద్ద పరిణామమే జరుగుతోందనే చర్చకు తెరలేపాయి,తొలుత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి అగ్రనేతల వ్యాఖ్యలు, ఆ తర్వాత కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి...

ఈ క్రమంలో కొండా సురేఖ కుమార్తెకు వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించడం అధికార మార్పు ప్రచారానికి బలం చేకూరినట్లైంది...ఈ  నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని నేరుగా యూఎస్ వెళ్లాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనే కారణంతో తన పర్యటనను అర్థాంతరంగా విరమించుకుని హైదరాబాద్ తిరుగుపయనమవడం గమనార్హం ,ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడికి దారితీస్తాయా? రేవంత్ రెడ్డి కుర్చీ కిందకు నీళ్లు వచ్చాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది...

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు సాఫీగా జరిగే సమయం చూసి వ్యవహారం పూర్తి చేసినట్లే, తెలంగాణలోనూ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన ముగిసే నాటికి పక్కన పెడుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న హిస్టరీ ప్రకారం, ఏ ఒక్క ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో నిలదొక్కుకుని, అధిష్టానానికి పోటీగా ఎదిగే అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ సంప్రదాయం కాదనే చర్చ నడుస్తోంది.మళ్లీ అదే రీతిలో సీల్డ్ కవర్ సీఎంను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి....

పరకాల అసెంబ్లీ స్థానం సీటుపై రేవూరు ప్రకాష్ రెడ్డికి అనుకూలంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ సీరియస్ అయ్యారు అయితే ఇది కేవలం పరకాల స్థానానికే పరిమితం కాదని,రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా ఇరకాటంలో పెట్టేందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే విశ్లేషణలు వస్తున్నాయి, ఈ మొత్తం వ్యవహారం వెనుక కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి...

అధికార మార్పిడి జరగాలంటే ఎమ్మెల్యేల మద్దతు అత్యంత కీలకం వంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 10 మంది మాత్రమే కావడం, ఆయన తన బలహీనతను తానే చాటుకున్నారా అనే సంకేతాలను ఇస్తోంది ,ఇది అధిష్టానానికి మరింత అవకాశంగా మారే ప్రమాదం ఉందనేది కొంతమంది కాంగ్రెస్ నేతల నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు,అదే సమయంలో రేవంత్ రెడ్డి స్థానంలో ఆయనకు సరితూగే స్థాయి, ఇమేజ్ ఉన్న ప్రత్యామ్నాయ నేత కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నారనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది ...

ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విమర్శలు పెరిగాయి,తెలంగాణ ప్రభుత్వం దాదాపు బీజేపీ 'బి' టీమ్‌లా వ్యవహరిస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ నేతలు గాంధీ, నెహ్రూ వంటి కాంగ్రెస్ దిగ్గజాలను కించపరిచినా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి,ఈ కారణాల వల్ల కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి కొత్త ముఖ్యమంత్రిని తీసుకురావడానికి గేమ్ నడుపుతుందా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది...

ఆగస్టు 23న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు,ఈలోగా రాజకీయంలో ఏం జరుగుతుంది? ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది అత్యంత ఉత్కంఠగా మారింది ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం సీఎంను మార్చే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి నేరుగా బీజేపీతో చేతులు కలిపి కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తారా? అన్న ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి....