Janam Muchata – Voice of the People | Telugu News Platformధరణి పేరుతో భూములు దోచుకొని..అగ్గిపెట్టె డ్రామాలు…హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 26 Aug 2026, 6:00 am
Date of Publish : 18 Aug 2026, 4:03 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 122 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ధరణి పేరుతో భూములు దోచుకొని..అగ్గిపెట్టె డ్రామాలు…హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్…

ధరణి పేరుతో భూములు దోచుకొని..అగ్గిపెట్టె డ్రామాలు…హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్…

22ఏ జాబితాలో భూములు చేరడంతో ప్రభావితమైన ప్రజల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హరీశ్‌రావు తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని ఆయన అన్నారు. భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు....

బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన భూ వ్యవహారాలు, అవినీతి, అక్రమాలపై తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన ఉందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలనే బీఆర్‌ఎస్‌ నేతల ఆశలు ఎప్పటికీ నెరవేరవని హరీశ్‌రావు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు....