Janam Muchata – Voice of the People | Telugu News Platformమహబూబాబాద్‌లో కలెక్టర్ స్నేహా శబరీష్ యాక్షన్: అధికారుల్లో వణుకు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 26 Aug 2026, 5:57 am
Date of Publish : 16 Aug 2026, 4:57 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 799 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Komaram Bheem Asifabad > Mahabubabad > Politics > Telangana

మహబూబాబాద్‌లో కలెక్టర్ స్నేహా శబరీష్ యాక్షన్: అధికారుల్లో వణుకు…

మహబూబాబాద్‌లో కలెక్టర్ స్నేహా శబరీష్ యాక్షన్: అధికారుల్లో వణుకు…

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి,పాలనలో ఏమాత్రం అవినీతి ఆరోపణలు వచ్చినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పనిపై సరిగా ఫోకస్ పెట్టకపోయినా ఏ స్థాయి అధికారినైనా వదిలేది లేదని ఆమెహెచ్చరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల వ్యవధిలోనే వరుసగా సస్పెన్షన్లు, సరెండర్లు, షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నారు...

​కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే మొత్తం 21 మంది అధికారులపై విభిన్న స్థాయిల్లో చర్యలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ మధ్య కాలంలో జిల్లా అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది  ఆ తరువాత R&B EE, DCO, DPO, మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు అంతే కాకుండా గార్ల మండల SOను విధుల నుంచి తొలగించడం జరిగింది అదే విధంగా విద్యా శాఖలో ఐదుగురికి, వైద్య శాఖలో ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు, అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహించినదుకు గాను హౌసింగ్ PDపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇద్దరు ICDS టీచర్లను విధుల నుంచి తొలగించారు ఈ క్రమంలో రెవెన్యూ, ఐసీడీఎస్ శాఖల్లో వచ్చిన ఫిర్యాదులపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది....

​ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో నిర్లక్ష్యం వహించినా, అవినీతి ఆరోపణలు వచ్చినా కలెక్టర్ వెంటనే విచారణ చేపడుతున్నారు,తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత కూడా పనితీరులో మార్పు రాకపోతే నేరుగా సస్పెండ్ చేస్తున్నారు,​బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ICDS మరియు DM&HO పై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు,
"గతంలో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా పనిచేయాలి. లేకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా చర్యలు తీసుకుంటాం." అంటూ కలెక్టర్  హెచ్చరికలు జారీ చేశారు....

​గతంలో వెనుకబడిన జిల్లాగా పేరుగాంచి అధికారుల్లో కొంత నిర్లక్ష్యం ఉండేదని, అయితే కలెక్టర్ ప్రతిరోజూ సమయపాలన పాటిస్తూ, ఆఫీసులకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో పర్యటిస్తుండటంతో అధికారుల్లో మార్పు మొదలైంది సమయానికి ఆఫీసులకు రావడం, అవినీతికి దూరంగా ఉండటం, ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.....