Janam Muchata – Voice of the People | Telugu News Platformగత పాలనలో చేతకానితనం…ట్విట్టర్‌లో నీతి పాఠాలా? కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 26 Aug 2026, 6:01 am
Date of Publish : 16 Aug 2026, 12:48 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 151 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Komaram Bheem Asifabad > Mahabubabad > Politics > Telangana

గత పాలనలో చేతకానితనం…ట్విట్టర్‌లో నీతి పాఠాలా? కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు….

గత పాలనలో చేతకానితనం…ట్విట్టర్‌లో నీతి పాఠాలా? కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి తీవ్ర విమర్శలు….

హైదరాబాద్ :బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు కనీసం సొంత భవనాలు కూడా నిర్మించలేకపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక వైఫల్యం చెందిన కేటీఆర్, నేడు ట్విట్టర్ పిట్టలా సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో పదేండ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని పొంగులేటి విమర్శించారు. సొంత గ్రామాన్నే బాగుచేసుకోలేని దద్దమ్మలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పరిపాలనా పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు….

అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాను సాధించడంలో బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. అధికారం కోల్పోయాక డ్రామారావు నీళ్లపై నీతి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంటే, బీఆర్‌ఎస్ మాత్రం ఆ పార్టీకి ‘బీ-టీమ్’లా వ్యవహరించిందని ఆరోపించారు. కేటీఆర్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లి రహస్యంగా బీజేపీ అగ్రనేతల ఇళ్ల ముందు బతిమిలాడుకున్న విషయం ప్రజలు మర్చిపోలేదని ఎద్దేవా చేశారు…

పరిపాలన అంటే ఫాంహౌస్‌లలో పడుకోవడం, పేయిడ్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం కాదని చురకలు అంటించారు.గత పదేండ్లలో చేసిన పాపాలు, వైఫల్యాలపై కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెబితే కొంతైనా హుందాగా ఉంటుందని పొంగులేటి హితవు పలికారు….