Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం: హైదరాబాద్-విశాఖ ప్రయాణం ఇక మరింత… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 9:27 pm
Date of Publish : 02 Aug 2026, 1:14 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 500 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం: హైదరాబాద్-విశాఖ ప్రయాణం ఇక మరింత సులభతరం…

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం: హైదరాబాద్-విశాఖ ప్రయాణం ఇక మరింత సులభతరం…

ఖమ్మం సిటీ :తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 'ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైటెక్ హైవే' పనులు పూర్తయ్యాయి…రైల్వే ఓవర్ బ్రిడ్జి ఒకవైపు మాత్రమే పూర్తి కావడంతో ప్రస్తుతం ఒకవైపు రాకపోకలు అనుమతి ఇవ్వడం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు…హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్‌లో భాగంగా నిర్మించిన ఈ అత్యాధునిక జాతీయ రహదారి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వాహనాల రాకపోకలకు పూర్తిస్థాయిలో అనుమతి ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ హైవే తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ప్రారంభమై, ఏపీలోని రాజమండ్రి సమీపంలో ఉన్న దేవరపల్లి వద్ద (16వ నెంబర్ జాతీయ రహదారిలో) ముగుస్తుంది.దీని మొత్తం పొడవు సుమారు 165 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 90 కిలోమీటర్లు, ఏపీలో 75 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు…

ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వారు ఇకపై విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా సుమారు 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.సూర్యాపేట నుంచి చూసుకుంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఆదా అవుతుంది. గతంలో సూర్యాపేట నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లడానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టేది, కానీ ఈ కొత్త హైవే ద్వారా కేవలం రెండున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు సుమారు రూ. 3,573 కోట్ల వ్యయంతో 'భారత్‌మాల ఎకనామిక్ కారిడార్' పథకం కింద నిర్మించిన ఈ రహదారి అనేక ప్రత్యేకతల సమాహారమని అధికారులు తెలియజేస్తున్నారు….

ఇది తెలుగు రాష్ట్రాల్లోనే తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే. దీనిపైకి ఎక్కడ పడితే అక్కడ వాహనాలు, పశువులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కేవలం నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. సుమారు ప్రతి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశారు,ఈ హైవేలో మరో ప్రత్యేకత 'క్లోజ్డ్ టోలింగ్ సిస్టం'ను అందుబాటులోకి తెచ్చారు. మీరు ఎక్కడ హైవే ఎక్కారో, ఎక్కడ దిగారో ఆ లెంత్ డిస్టెన్స్ బట్టి మాత్రమే టోల్ వసూలు చేస్తారు, అంతే కాకుండా ఐదు ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ (ATMS) ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో వెళ్లినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్లో వచ్చినా ఏఐ కెమెరాలు పసిగట్టి నేరుగా చలాన్లు విధిస్తాయి,అత్యవసర సమయాల్లో బాధితులను తరలించడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఓపెనింగ్ ఉంటుంది. ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీల సిసి కెమెరాలు, సోలార్ దీపాలు ఏర్పాటు చేశారు, ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు ఇరువైపులా 5 ఎకరాల విస్తీర్ణంలో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్ రూమ్స్ వంటి సదుపాయాలు కల్పించారు. క్యూఆర్ కోడ్ బోర్డులను స్కాన్ చేసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ వివరాలు తెలుసుకోవచ్చు,ఈ హైవేపై గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చునని అధికారులు తెలిపారు…

పచ్చని పంట పొలాల మధ్య నుంచి సాగే ఈ ఆహ్లాదకరమైన ప్రయాణం ప్రజలకే కాకుండా రైతులు, స్థానికులకు ఎంతో ఉపయోగపడనుందని,ఈ ప్రాజెక్టు వల్ల దీని వెంట ఉన్న ప్రాంతాల్లో ఉపాధి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు,2017లో ప్రతిపాదనలు రూపొందించుకున్న ఈ ప్రాజెక్టు, ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి నేడు సకల హంగులతో ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా కావడమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి….