Janam Muchata – Voice of the People | Telugu News Platformనేలకొండపల్లి రాజేశ్వరపురంలోని రైస్ మిల్లుపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారుల… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 4:45 am
Date of Publish : 24 Jul 2026, 12:42 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 250 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

నేలకొండపల్లి రాజేశ్వరపురంలోని రైస్ మిల్లుపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారుల దాడులు…..

నేలకొండపల్లి రాజేశ్వరపురంలోని రైస్ మిల్లుపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారుల దాడులు…..

నేలకొండపల్లి: ప్రభుత్వానికి చెందిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని పక్కదారి పట్టించిన భారీ కుంభకోణం నేలకొండపల్లి మండలంలో వెలుగుచూసింది. వరంగల్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఆర్.వి & ఇ.ఓ), సివిల్ సప్లై అధికారుల సంయుక్త తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది.అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని ‘శ్రీ అరుణాచల శివ రైస్, ఫుడ్ అండ్ ఇండస్ట్రీస్’లో జులై 22వ తేదీన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు....

ఈ దాడుల్లో భాగంగా మిల్లులోని రికార్డులను, స్టాక్‌ను పరిశీలించగా ప్రభుత్వ సీఎంఆర్ వరి ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు...రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన స్టాక్ కంటే ఏకంగా 442.720 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. లెక్కల్లో చూపకుండా పక్కదారి పట్టిన ఈ ధాన్యం మార్కెట్ విలువ సుమారు రూ. 1,23,96,160/- (కోటీ ఇరవై మూడు లక్షల తొంభై ఆరు వేల నూట అరవై రూపాయలు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు....

ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడినందుకు గాను అధికారులు M/S అరుణాచల శివ రైస్, ఫుడ్ అండ్ ఇండస్ట్రీస్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణానికి బాధ్యుడిగా నిర్ధారిస్తూ రైస్ మిల్లు భాగస్వామి అయిన ఓరుగంటి కిరణ్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో వరంగల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు సివిల్ సప్లైస్ శాఖల అధికారులు పాల్గొన్నారు....