Janam Muchata – Voice of the People | Telugu News Platformతక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ రూ.85.70 లక్షల టోకరా: అంతర్రాష్ట్ర… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:34 am
Date of Publish : 18 Jul 2026, 1:45 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 306 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ రూ.85.70 లక్షల టోకరా: అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్ట్….

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ రూ.85.70 లక్షల టోకరా: అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్ట్….

ఖమ్మం, జూలై 18 (కామేపల్లి ): తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, భారీ మొత్తంలో నగదు వసూలు చేసి పరారైన ఇద్దరు అంతర్రాష్ట్ర మోసగాళ్లను కామేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన నారాయణప్ప గురప్ప (63). ఇతను గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఉద్యోగాలు, భూములు, బంగారం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈసారి తన పేరును ‘బోగా లక్ష్మీనారాయణ’గా మార్చుకుని, అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తి మార్గంలో అడుగుపెట్టాడు. కెప్టెన్ బంజరా గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని అన్నదానాలు, పడిపూజలు, శబరిమల యాత్రలు నిర్వహిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు....ఈ క్రమంలో బాసీత్‌నగర్‌కు చెందిన బానోత్ సాయికుమార్ (20) అనే డ్రైవర్ తో కలిసి 2026 ఫిబ్రవరి నుండి ఈ మోసాలకు తెరలేపారు. మొదట కొందరికి నగదు వెనక్కి ఇచ్చి నమ్మకం కలిగించి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉడాయించారు.....

విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం, కామేపల్లి మండలంతో పాటు ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది వ్యక్తుల నుండి సుమారు రూ. 85.70 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ డబ్బుతో నిందితులు విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు, గోవా పర్యటనలు, పాత అప్పులు తీర్చుకోవడం, గ్రామంలో అన్నదానాలు, ఆలయ ఉత్సవాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు....

ఒక మైనర్ బాలికను వెంట తీసుకెళ్లిన ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఆ బాలికను వదిలేసి బాసీత్‌నగర్ వస్తుండగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక మారుతి ఈకో కారు (TS 27 G 2636), రెండు స్మార్ట్‌ఫోన్లు మరియు బోగాలక్ష్మీనారాయణ పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.సింగరేణి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సాగర్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.ప్రజలు ఎవరైనా సరే తక్కువ ధరలో బంగారం, భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే ఆఫర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.....