Janam Muchata – Voice of the People | Telugu News Platform › గంజాయి రవాణాదారులకంటే మావోయిస్టులు బెటర్…డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు…. › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 9:42 pm
Date of Publish : 07 Jul 2026, 8:35 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 247 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

గంజాయి రవాణాదారులకంటే మావోయిస్టులు బెటర్…డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు….

గంజాయి రవాణాదారులకంటే మావోయిస్టులు బెటర్…డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు….

ఖమ్మం: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సంస్కృతిపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.ఒకప్పుడు దేశాన్ని అతలాకుతలం చేసిన మావోయిస్టుల కంటే ఈ గంజాయి రవాణాదారులే సమాజానికి ఎక్కువ ప్రమాదకరం. మావోయిస్టులకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది, కానీ ఈ డ్రగ్స్ మాఫియాకు కేవలం యువత జీవితాలను నాశనం చేసి డబ్బు సంపాదించడమే పరమావధి. అందుకే గంజాయి వ్యాపారుల కంటే మావోయిస్టులే బెటర్ అనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు....

గంజాయి సరఫరాదారులు సరికొత్త పద్ధతుల్లో యువతను బానిసలుగా మారుస్తున్నారని డీజీపీ హెచ్చరించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని 'గంజాయి చాక్లెట్ల' రూపంలో దీనిని సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. గంజాయి చాక్లెట్ల' తయారీదారులు ప్రధాన  సరఫరాదారులు యొక్క వ్యాపార నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేసేందుకు 'పిడి యాక్ట్ నమోదుకు కూడా వెనకాడబోమని   ఉక్కుపాదం' మోపుతామని హెచ్చరించారు.

భౌగోళికంగా ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రాధాన్యతను డీజీపీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల సరిహద్దులు ఖమ్మం పరిసర ప్రాంతాలకు అనుసంధానమై ఉన్నాయని ఏజెన్సీ ప్రాంతాల నుండి తెలంగాణలోకి గంజాయి, ఇతర నిషేధిత పదార్థాలు రాకుండా అడ్డుకోవడంలో ఖమ్మం జిల్లా పోలీసులు ఒక 'రక్షణ కవచం'లా పని చేయాలని ఆదేశించారు.సరిహద్దుల్లో నిఘా మరియు తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు.

పోలీస్ శాఖలో జవాబుదారీతనం (Accountability) పెంచేందుకు డీజీపీ సీవీ ఆనంద్ సరికొత్త నిబంధనను తీసుకువచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు....

కేసుల దర్యాప్తు తీరుపై క్షేత్రస్థాయి అధికారులకు డీజీపీ గట్టి నినాదం ఇచ్చారు. కేవలం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడంతో పోలీస్ బాధ్యత ముగిసిపోదని స్పష్టం చేశారు.ప్రతి కేసును కోర్టు ట్రయల్స్ ముగిసే వరకు గట్టిగా ఫాలో-అప్ చేయాలని,నిందితులకు కోర్టుల్లో కఠిన శిక్షలు పడేలా పక్కా సాక్ష్యాధారాలను సేకరించి, లీగల్ టీమ్‌లతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.....