Janam Muchata – Voice of the People | Telugu News Platform › ప్రజలు చెత్తబుట్టలో పారేసినా సిగ్గు లేకుండా మంత్రి పొంగులేటిపై విమర్శలా?… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 10:28 pm
Date of Publish : 29 Jun 2026, 5:02 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 255 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ప్రజలు చెత్తబుట్టలో పారేసినా సిగ్గు లేకుండా మంత్రి పొంగులేటిపై విమర్శలా? తాతా మధుపై కాంగ్రెస్ శ్రేణుల ఘాటు వ్యాఖ్యలు !!

ప్రజలు చెత్తబుట్టలో పారేసినా సిగ్గు లేకుండా మంత్రి పొంగులేటిపై విమర్శలా? తాతా మధుపై కాంగ్రెస్ శ్రేణుల ఘాటు వ్యాఖ్యలు !!

ఖమ్మం సిటీ :ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు,ప్రజలు తిరస్కరించినా బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని, హద్దులు దాటి మాట్లాడితే ఖమ్మం జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.....

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి, పొలిటికల్ చెత్తబుట్టలో పారేసినా తాతా మధుకు ఇంకా సిగ్గు రాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. "శీనన్న (పొంగులేటి) దెబ్బకు జిల్లాలో బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతైంది. కనీసం తలదాచుకోవడానికి చోటు లేకపోయినా.. మైకుల ముందుకొచ్చి అంతలా ఊగిపోతుండటం తాతా మధు అజ్ఞానానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు…..కేవలం శాసనమండలి (ఎమ్మెల్సీ) సీటుకే పరిమితమైన మధు.. ప్రజల మనిషిగా, లక్షలాది మంది గుండెల్లో స్థానం సంపాదించిన పొంగులేటిని విమర్శించడం హాస్యాస్పదం.పొంగులేటి పేరు చెప్తేనే మీడియాలో నాలుగు మైకులు దొరుకుతాయనే విషయాన్ని ఆయన మర్చిపోకూడదని ఎద్దేవా చేశారు….

రైతు సమస్యలపై చర్చకు రావాలంటూ తాతా మధు విసిరిన సవాల్‌పై కాంగ్రెస్ శ్రేణులు ఘాటుగా స్పందించాయి. జిల్లా ప్రగతి కోసం, ప్రజా పాలనలో నిమిషం తీరిక లేకుండా బిజీగా ఉన్న మంత్రి పొంగులేటి.. ఇలాంటి పస లేని సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన దాకా ఎందుకు, శీనన్న సైన్యమైన సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలం, అభిమానులమే చాలని స్పష్టం చేశారు.ఖమ్మం నడిబొడ్డున ఉన్న వైరా రోడ్డు జెడ్పి సెంటరో, లేదా ఇల్లందు క్రాస్ రోడ్డో తాతా మధునే తేల్చుకోవాలని సవాల్ విసిరారు.డేట్, టైమ్ ఫిక్స్ చేస్తే… తామే నేరుగా వచ్చి ఎవరేంటో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.పదేళ్ల దరిద్రపు పాలన వర్సెస్ ఏకకాల రుణమాఫీ అంశంపై చర్చకు వస్తే బీఆర్‌ఎస్ పదేళ్ల పాపాల చిట్టాను బయటపెడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. గత ప్రభుత్వం రుణమాఫీని ఐదేళ్లు సాగదీసి, రైతులను డిఫాల్టర్లుగా మార్చిందని, 'ధరణి' పేరుతో అన్నదాతల రక్తాన్ని తాగిందని ఆరోపించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి, అన్నదాతకు ఎలా అండగా నిలిచిందో లెక్కలతో సహా నిరూపిస్తామన్నారు…..

ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే జిల్లా ప్రజలు, ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని కార్యకర్తలు హెచ్చరించారు. ఇప్పటికైనా తాతా మధు హద్దుల్లో ఉండి నాలుక అదుపులో పెట్టుకోకపోతే, ఆయన తిరిగే రోడ్ల మీద కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగునా నిలదీస్తారని, తద్వారా ఖమ్మం జిల్లాలో ఆయన పొలిటికల్ కెరీర్ శాశ్వతంగా ముగిసిపోవడం ఖాయమని హెచ్చరించారు....