Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం సిటీ ఖానాపురం హవేలీలో ‘SIR’ పై అవగాహన కార్యక్రమం:… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 12:19 am
Date of Publish : 22 Jun 2026, 9:32 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 170 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం సిటీ ఖానాపురం హవేలీలో ‘SIR’ పై అవగాహన కార్యక్రమం: బీఎల్‌ఏలకు బచ్చు విజయ్ కుమార్ దిశానిర్దేశం !!

ఖమ్మం సిటీ ఖానాపురం హవేలీలో ‘SIR’ పై అవగాహన కార్యక్రమం: బీఎల్‌ఏలకు బచ్చు విజయ్ కుమార్ దిశానిర్దేశం !!

ఖమ్మం (ఖానాపురం హవేలీ):ఓటరు జాబితాల రూపకల్పన, సవరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) పాత్ర అత్యంత కీలకమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ పరిధిలో ఉన్న 2, 3, 4, 5, 6, 7, 8, 14, 15 డివిజన్ల బీఎల్‌ఏలకు, డివిజన్ ముఖ్య నాయకులకు 'SIR' (Special Intensive Revision - ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) పై ఖమ్మం సిటీ BRS పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్ కుమార్, నాగండ్ల కోటేశ్వర రావు, వలరాజు తదితరులు హాజరై నాయకులకు, ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.....

ఈ సందర్భంగా నాయకులు 'SIR' కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ.. ఎలక్షన్ కమిషన్ చేపట్టే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించవచ్చని తెలిపారు.
18 ఏళ్లు నిండిన యువతీయువకులను గుర్తించి, వారిని ఓటర్లుగా నమోదు చేయించడం.ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నా, లేదా మరణించిన మరియు వలస వెళ్లిన వారి ఓట్లను గుర్తించి జాబితా నుండి తొలగించడం.ఓటరు కార్డుల్లో పేర్లు, చిరునామా, వయసు వంటి తప్పులు ఉంటే వాటిని సరిచేయడంలో బీఎల్‌ఏలు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు....

ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్ కుమార్, నాగండ్ల కోటేశ్వర రావు, వలరాజు మాట్లాడుతూ.. "ప్రతి డివిజన్ పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే బాధ్యతను భుజాన వేసుకోవాలి. ఎన్నికల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించాలంటే ఇప్పటి నుంచే ఓటరు జాబితాపై పూర్తి అవగాహన పెంచుకోవాలి" అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల (2 నుండి 8, మరియు 14, 15) ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....