తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం రూరల్, జూన్ 18: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం అన్నారు.గురువారం మండల పరిధిలోని గోళ్లపాడులో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు నిరాధారమైన విమర్శలకు దిగుతున్నాయని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల పూర్తి మద్దతుతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు నేతలు విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన హితవు పలికారు….
అభివృద్ధి పథంలో రాష్ట్రంమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి….
ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కొనియాడారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన సూచించారు.పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మరింత బలపడుతోందని పార్టీ నాయకుడు మరో నాయకుడు మద్ది వీరారెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గతంలో కంటే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో లభించిన భారీ మెజార్టీని మించి, ఈసారి మరింత ప్రజాభిమానంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం తథ్యమన్నారు…"రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం. ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు లభించే అవకాశం లేదు. ప్రజలంతా అభివృద్ధి వైపే నిలుస్తున్నారు, పాలేరులో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు….
మంత్రి పొంగులేటిపై విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు….
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బి.ఆర్.యస్ నాయకులు చేస్తున్న విమర్శలు కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.గతంలో అధికారంలో ఉన్నవారు రాష్ట్రానికి, ప్రజలకు ఏమి చేశారో ప్రజలకు బాగా తెలుసని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అందుకే ప్రత్యర్థి పార్టీలకు ప్రజాదరణ రోజురోజుకూ తగ్గుతోందని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించడమే కాంగ్రెస్ కార్యకర్తల ఏకైక లక్ష్యమని వారు ప్రకటించారు. గత ఎన్నికల రికార్డులను తిరగరాస్తూ, ఈసారి మరింత భారీ మెజార్టీ సాధించేందుకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజల మద్దతు పూర్తిగా కాంగ్రెస్‌కే ఉందని, రానున్న ఎన్నికల్లో కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లింగ శ్రీనివాసరావు, చింతపల్లి మాజీ సర్పంచ్ ముత్యం కృష్ణారావు, గనిగంటి సురేష్, రుద్ర ఉపేందర్, శ్యామల రామ్ రెడ్డి, గంగిరెడ్డి, కొండం మధు, వెల్దుర్తి నారాయణ, సోషల్ మీడియా ప్రతినిధి బద్రి సాయి తదితరులు పాల్గొన్నారు……
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456